'భాగమతి'పై బాలీవుడ్ కన్ను.. భారీ ఆఫర్!

'బాహుబలి 2' సినిమా చూసిన బాలీవుడ్ జనాలు అనుష్క గ్లామర్ చూసి ఆశ్చర్యపోయారు. ఇంత చక్కదనం బాలీవుడ్ సినిమాలు చేస్తే బాగుంటుందనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ఆమె గ్లామర్ కి పడిన మార్కుల కారణంగా, బడా దర్శక నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరిపారు .. భారీ మొత్తంలో పారితోషికాన్ని ఆఫర్ చేశారు. అయినా అనుష్క పెద్దగా ఆసక్తి చూపలేదు.

 దాంతో ఆమె తెలుగులో చేస్తోన్న 'భాగమతి' సినిమాపై వాళ్లు దృష్టి పెట్టారు. ఈ సినిమా హిందీ వెర్షన్ డిజిటల్ హక్కుల కోసం పోటీ పడుతున్నారు. హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులకు 12 కోట్లకి పైగా ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ - త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులు 11 కోట్లకి అమ్ముడైతే, 'భాగమతి' హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులు 12 కోట్లకి పైగా పలుకుతుండటం విశేషం.  
Go Back to Shorts
anushka

More Telugu News